బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (10:20 IST)

కిరణ్ అబ్బవరం క మూవీ మెగాస్టార్ చిరంజీవికి నచ్చిందా?

chiru wishes to kiran
chiru wishes to kiran
హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా నిలిచిన ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందించారు. క సినిమాను చూసిన మెగాస్టార్ మూవీ టీమ్ కు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. దర్శకద్వయం టేకింగ్ తోపాటు క్టయిమాక్స్ అబ్బురపరిచేలా వుందంటూ కామెంట్లు వచ్చాయి.

అయితే చిరంజీవి ఈ సినిమా సరికొత్త అనిపించిందని దీవెనలు అందించినట్లు తెలిసింది. కిరణ్ కష్టానికి తగిన ఫలితం దక్కిందని కితాబిచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు క సినిమా టీమ్.
 
 "క" సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. "క" సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో "క" సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది.