విజ‌య్ దేవ‌ర‌కొండ - దిల్ రాజు మ‌ధ్య గొడ‌వ..‌. అస‌లు ఏమైంది..?

Vijay Devarakonda
శ్రీ| Last Modified సోమవారం, 29 జులై 2019 (12:57 IST)
ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా.. సినిమాల‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ మాత్రం బాగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సెన్సేష‌న‌ల్ స్టార్‌తో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎగ‌బ‌డుతున్నారు. అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు కూడా విజ‌య్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.


కానీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం దిల్ రాజుతో సినిమా అంటే అటు ఓకే అన‌డం లేద‌ట‌. అలాగ‌ని నో అన‌డం లేద‌ట‌. చూద్దాం చేద్దాం అని చెబుతున్నాడ‌ట‌. దీంతో దిల్ రాజు చాలా కోపంగా ఉన్నాడ‌ట‌.

ఎందుకుంటే.. దిల్ రాజు సినిమా చేయ‌మ‌ని అడిగితే.. ఏ హీరో అయినా స‌రే వెంట‌నే ఓకే అంటారు. ఎందుకంటే... థియేట‌ర్స్ విష‌యం కానీ.. ప్ర‌మోష‌న్స్ విష‌యం కానీ.. బాగా చూసుకుంటారు అని. కానీ.. ఏమైందో ఏమో కానీ విజ‌య్, దిల్ రాజుతో సినిమా అంటే ఎందుక‌నో ఇంట్ర‌ెస్ట్ చూపించ‌డం లేద‌ట‌. దీంతో అస‌లు దిల్ రాజు, విజ‌య్ మ‌ధ్య ఏం జ‌రిగిందో అని ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.దీనిపై మరింత చదవండి :