దిల్ రాజు గురించి ఆయన కూతురు ట్వీట్
ఈమధ్యే ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2017లో తన మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన రెండో పెళ్ళి చేసుకున్నారు. తన పెళ్ళికి సంబంధించి మీడియాకు సమాచారాన్ని కూడా స్వయంగా దిల్ రాజే ఇచ్చారు. నిజామాబాద్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అతి తక్కువమంది బంధువులతో దిల్ రాజు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే దిల్ రాజు మొదటి భార్య కూతురు అన్షితారెడ్డి అమెరికాలో ఉంటున్నారు. ఆమెకు గత కొన్నినెలల క్రితమే వివాహమైంది. లాక్ డౌన్ కావడంతో ఆమె దిల్ రాజు వివాహానికి హాజరు కాలేదు. అయితే తండ్రి పెళ్ళిపై మాత్రం ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది.
తండ్రిగా మీరు ఎంత గొప్పవారో నాకు తెలుసు. మీ చేతులు పట్టుకుని నడిచిన నేను ఎలాంటి ఇబ్బందులు పడలేదు. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. మీ కొత్త జీవితం సాఫీగా ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేసింది అన్షితారెడ్డి.