సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (14:42 IST)

సినీ కార్మికుల సమస్య పరిష్కారం కాలేదు.. చర్చలు జరుగుతున్నాయ్... దిల్ రాజు

Dil Raju-
తెలుగు చిత్రపరిశ్రమలో సినీ నిర్మాణ కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె గురువారంతో ముగిసింది. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారథ్యంలో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇటు సినీ నిర్మాణ కార్మికులు, అటు, చిత్ర మండళ్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం పనిచేయాల్సివుంది. 
 
దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ, ఇరు వర్గాలతో చర్చలు మొదలయ్యాయని, ఆరోగ్యకర వాతావరణంలో సమస్యలపై చర్చిస్తున్నామని వెల్లడించారు. అన్ని అంశాలు ఓ కొలిక్కి వచ్చాక, తాము ఏ నిర్ణయానికి వచ్చామన్నది మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఇవన్నీ కూడా తేలిపోయే మేఘాల్లాంటివని, కార్మికులు సమస్యలు కూడా పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ వ్యవహారంలో చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అనే తేడా లేకుండా, చర్చల సందర్భంగా ఎవరు సమస్యలు వారు చెబితే దానిపై అందరం కలిసి మాట్లాడుకుని అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుందామని ఆయన వెల్లడించారు.