Widgets Magazine

కంచ‌ర‌పాలెం సినిమాపై మారుతి షాకింగ్ కామెంట్స్..!

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:59 IST)

ఈ రోజుల్లో సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... చిన్న సినిమాతో పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుని ట్రెండ్ క్రియేట్ చేసిన యువ ద‌ర్శ‌కుడు మారుతి. ఆ త‌ర్వాత ప్రేమ‌క‌థా చిత్ర‌మ్, కొత్త జంట‌, భ‌లేభ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు ఇలా వ‌రుస‌గా సక్సెస్‌ఫుల్ మూవీస్ చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్నారు. మారుతి తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. నాగ‌చైత‌న్య న‌టించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. 
maruti
 
ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మారుతి మీడియాతో మాట్లాడుతూ... కంచ‌ర‌పాలెం సినిమాని అంద‌రూ కొత్త‌వాళ్ల‌తో తీసారు. ఇండ‌స్ట్రీలో చాలామంది ప్ర‌ముఖులు ఈ సినిమాని ప్ర‌మోట్ చేసారు.. చేస్తున్నారు. కానీ... జ‌నం చూడ‌టం లేదు. వాళ్ల‌కి తెలుసు.. ఏ సినిమాని చూడాలో. ఏ సినిమాని చూడ‌కూడ‌దో. ప్ర‌మోట్ చేసినంత మాత్రాన చూడ‌టానికి వాళ్ల‌ేమ‌న్నా పిచ్చోళ్లా అన్నారు. 
 
మారుతి ఈ రోజుల్లో సినిమాని కూడా కొత్త‌వాళ్ల‌తోనే తీసాడు. కానీ.. ఇప్పుడు మ‌రో డైరెక్ట‌ర్ కొత్త‌వాళ్ల‌తో సినిమా తీస్తే.. అభినందించ‌కుండా కొత్త‌వాళ్ల‌తో సినిమా తీస్తే చూడ‌డానికి జ‌నం ఏమ‌న్నా పిచ్చోళ్లా అంటూ మాట్లాడ‌టం వెన‌కున్న మ‌ర్మం ఏమిటో..?


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగార్జున‌కి కోపం వ‌చ్చింది. ఏం చేసాడో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఏదీ మ‌న‌సులో దాచుకోలేడు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పేస్తుంటాడు. ...

news

నా భార్య గర్భస్రావానికి అతనే కారణం.. హిందీ నటుడు

బాలీవుడ్ నటుడు సుమీత్ సచ్‌దేవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య గర్భవిచ్ఛిత్తికి ఆమె బాస్ ...

news

సల్మాన్ సరసన నటించేందుకు ప్రియాంక వెయ్యిసార్లు ఫోన్ చేసిందట..?

''భారత్'' అనే సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ ...

news

దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం

దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం దక్కనుంది. తెలుగు ప్రేక్షకులనే కాకుండా భారతీయ సినీ ...

Widgets Magazine