శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 17 అక్టోబరు 2019 (18:22 IST)

దర్బార్ క‌థ‌ను బ‌య‌ట‌పెట్టిన మురుగుదాస్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్నచిత్రం ద‌ర్బార్. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా సౌత్ ఆడియెన్స్ ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త విషయాలను దర్శకుడు మురగదాస్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
 
ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే... ముఖ్యంగా సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఓ టాక్ వైరల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో రాజకీయ అంశాలు ఉండవని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కి సంబంధించిన కథ అని దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇందులో పోలీస్ పాత్ర అలెక్స్ పాండియన్ స్టైల్లో ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు.
 
ఇకపోతే సినిమాలో మాస్ ఆడియెన్స్‌కి నచ్చే విధంగా సీనియర్ గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం ఒక పాట పాడినట్లు వివరణ ఇచ్చారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా నివేద థామస్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టితో పాటు మాజీ క్రికెటర్ యువరాజ్ ఫాదర్ యోగ్ రాజ్ సింగ్ కూడా సినిమాలో స్పెషల్ పాత్రల్లో కనిపించనున్నారు.