ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (18:53 IST)

డైరెక్టర్ శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ తాజా చిత్రం ప్రకటన

Sekhar Kammula, sunil narang, dhanush
Sekhar Kammula, sunil narang, dhanush
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన చిత్రాలను రూపొందించడంలో మంచి పేరు తెచ్చుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జునతో మల్టీ స్టారర్ చేస్తున్నారు. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్ యూనిట్) బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
తాజాగా ప్రొడక్షన్ హౌస్ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. నాగ చైతన్య, సాయి పల్లవితో క్లాసిక్ 'లవ్ స్టోరీ', ప్రస్తుతం జరుగుతున్న  #DNS తర్వాత, ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ SVCLLP తో శేఖర్ కమ్ముల  థర్డ్ కొలాబరేషన్.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు.  
 
ఈ కొత్త చిత్రం లార్జర్ దెన్ లైఫ్ గా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శేఖర్ కమ్ముల, SVCLLP హ్యాట్రిక్ మూవీ హై బడ్జెట్, టాప్-క్లాస్ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందనుంది.
 
ప్రస్తుతం జరుగుతున్న #DNS పూర్తయిన తర్వాత ఇది ఫ్లోర్స్ పైకి వెళ్తుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.