బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (20:08 IST)

గంధర్వ విజయంతో ముందుకు సాగుతున్న మిలట్రీ మాన్ డైరెక్టర్ అప్సర్

director Upsar
director Upsar
సినిమా రంగంలో పలు రంగాలనుంచి ఇంట్రెస్ట్ తో వస్తుంటారు. కానీ దేశభక్తుడిగా మిలట్రీ కి సేవ చేసిన అప్సర్ తన ఆలోచనలతో వినూత్నమైన సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. అలా గత ఏడాది గంధర్వ సినిమాతో దర్శకుడిగా అప్సర్ తన ప్రతిభను చాటుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన గంధర్వ ఆడియెన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. తొలి ప్రయత్నంలోనే వినూత్నమైన కథాంశం యాంటి ఏజింగ్ ని ఎంచుకొని సాహసమే చేసాడు . 
 
గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఓటీటీలో తెలుగు తమిళ భాషల్లో మంచి ఆదరణను దక్కించుకుంది. రికార్డ్ వ్యూస్‌తో గంధర్వ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు అప్సర్ తన కొత్త సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. మరో ఆసక్తికరమైన పాయింట్‌తో పెద్ద నిర్మాణ సంస్థతో మరో ప్రాజెక్ట్ తో ఈ నెల ఆఖరున సెట్స్ మీదికి వెళ్ళనుండగా సినిమా గురించి త్వరలోనే అప్డేట్స్ ఇస్తానని దర్శకుడు చెప్పుకొచ్చారు.
 
రెండో ప్రాజెక్ట్ ఇలా ఉండగా.. మూడో సినిమాను కూడా లైన్‌లో పెట్టేశారు. బడా ప్రొడక్షన్ హౌస్ తో మరో క్రేజీ కాంబో కూడా సెట్ చేసుకున్నారు. ఇప్పటికే తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్న అప్సర్, ఇప్పటి వరకు ఎవరు ఊహించని మరో రెండు కథలతో త్వరలోనే మన ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.