గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (17:21 IST)

కేజీఎఫ్-2పై వెంకటేష్ సెన్సేషనల్ కామెంట్స్.. అర్థం లేని సినిమా అట

KGF2
KGF2
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్-2పై ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. కేజీఎఫ్ 2 అర్థం లేని, బుద్ధిహీన చిత్రం అంటూ కామెంట్లు చేసి వివాదంలో చిక్కుకున్నాడు. 
 
కాగా.. వెంకటేష్ మహా, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, ఇంద్రగంటి మోహన కృష్ణ, నందిని రెడ్డి యూట్యూబ్  రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు.
 
ఆ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా  కేజీఎఫ్ 2పై విమర్శలు గుప్పించాడు. కేజీఎఫ్ 2ని కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడు. అతను మాట్లాడే విధానం నెటిజన్లకు అస్సలు నచ్చలేదు.
 
ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన మరో దర్శకుడి సినిమా గురించి మాట్లాడేటప్పుడు వెంకటేష్‌ ఆలోచించాలని.. అలా మాట్లాడే హక్కు ఏముందని నెటిజన్లు అంటున్నారు.
 
ప్రశాంత్ నీల్‌తో తనకు పోటీ ఉన్నట్లుగా వెంకటేష్ మాటలు వున్నాయని ఫైర్ అవుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడంపై దర్శకురాలు నందిని రెడ్డి స్పందిస్తూ, ఈ చర్చ ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో లేదని, ఎవరినైనా బాధపెడితే, మొత్తం విషయానికి క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.