1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 17 ఏప్రియల్ 2025 (18:23 IST)

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

Dixit Shetty,  Vrinda Acharya
Dixit Shetty, Vrinda Acharya
దీక్షిత్ శెట్టి హీరోగా అభిషేక్ ఎమ్ దర్శకత్వంలో రూపొండుతున్న తెలుగు- కన్నడ బైలింగ్వల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. బృందా ఆచార్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ దేవి ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యానర్ పై హెచ్ కె ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ హర ఓం సాంగ్ ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు.
 
జుధాన్ శ్యాండీ ఈ సాంగ్ ని డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. ఆశ గురించి తేలియజేసే బట్టు విజయ్ కుమార్ లిరిక్స్ మీనింగ్ ఫుల్ గా వున్నాయి. మంగ్లీ పవర్ ఫుల్ వోకల్స్ సాంగ్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది.  ఈ చిత్రానికి అభిషేక్ జే డీవోపీగా పని చేస్తున్నారు. తేజస్ ఆర్ ఎడిటర్. రఘు మైసూర్ ప్రొడక్షన్ డిజైనర్.