ఢిల్లీ వ్యాపారవేత్తను పెళ్లాడిన ప్రాచీ తెహ్లాన్

prachi tehlan
ఠాగూర్| Last Updated: సోమవారం, 10 ఆగస్టు 2020 (09:15 IST)
ప్రముఖ సినీ నటి, మాజీ క్రీడాకారిణి ప్రాచీ తెహ్లాన్ ఎట్టకేలకు ఓ ఇంటికి కోడలైంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన ఈ పెళ్లి జరిగింది. దీనికి సంబంధించి ప్రాచీ తెహ్లాన్.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది... దానికింద '07-08-2020, వివాహ తేదీ' అనే క్యాప్షన్ పెట్టింది. ఆమె పెళ్లాడిన వరుడు పేరు రోహిత్ సరోరా.

ఇదిలావుంటే, హిందీ సీరియల్ 'దియా ఔర్ బాతీ హమ్‌'లో ప్రాచీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా ఆమె అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఆమె భారత నెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో ఆమె కెప్టెన్సీలోనే నెట్‌బాల్‌ పోటీల్లో జాతీయ జట్టు పోటీ చేసింది.దీనిపై మరింత చదవండి :