బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 జనవరి 2022 (14:32 IST)

మిల్కీ బ్యూటీ తమన్నా ఏం చేస్తుందో తెలుసా?

మిల్కీ బ్యూటీ తమన్నా బాహుబలి తర్వాత F2 చిత్రంతో అలరించింది. ఆ తర్వాత రెండుమూడు చిత్రాల్లో కనిపించినప్పటికీ అంతగా బిజీగా కనిపించడంలేదు కానీ అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. F3లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే సినిమాల్లో మరీ బిజీగా లేను కదా అని ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ శరీరాన్ని అలా వదిలేయడంలేదు. యోగా చేస్తూ ఫిట్నెస్ పైన శ్రద్ధ చూపిస్తోంది.

 
అసలు ఈ యోగాతో ప్రయోజనం ఏంటి? పుట్టినప్పటి నుంచి మనం ఎన్నోసార్లు రకరకాల దుస్తులను ధరిస్తూ... మారుస్తూ ఉంటాము. ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే భుజించే ఆహారం కూడా రకరకాల రుచులలో భుజిస్తున్నాము. కాని మార్పు లేకుండా కడవరకూ మనతో ఉండేది శరీరం.

కనుక మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, మన కల నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతుంది. మనసు మీరు చెప్పిన విధంగా వినకుండా, దాని ఇష్ట ప్రకారం ఆలోచనలను పెంపొందిస్తుంది. కనుక మీ కలలు నెరవేరాలంటే, మీ మనసు పట్టుదలతో తోడ్పడాలి.

మీ మనసు, శరీరం మీకు నచ్చినవిధంగా పనిచేయాలంటే వాటి రెండింటినీ మీ అదుపులోకి తెచ్చుకోవాలి. అలా అనుకూలంగా మరల్చగలిగే శక్తి యోగా ఇస్తుంది. కనుక యోగాభ్యాసం ఎంతైనా అవసరం. కుళ్లూ, కుతంత్రాలతో నిండిపోయిన నేటి సమాజంలో యోగా తప్పనిసరి.