శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 28 మే 2016 (13:52 IST)

నా వల్లే 'బ్రహ్మోత్సవం' ఫ్లాప్ అయింది.. డైరక్టర్‌ను తిట్టొద్దు : మహేష్ బాబు వినతి

సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఏదేని తప్పు జరిగినా.. ఒక సినిమా ఫ్లాప్ అయిన ఇతరులపై సులభంగా నెట్టేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఎక్కువ మంది ఉంటారు. కానీ, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ హీరో తాజాగా నటించిన చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 
 
నిజానికి ఈ చిత్రంపై ప్రతి ఒక్కరూ భారీ హోప్స్ పెట్టుకున్నారు. కానీ అనుకున్న అంచనాలకు ఆ సినిమా చేరలేకపోయింది. అనుకున్న విధంగా ఈ సినిమా హిట్ కానందుకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలను తప్పుపడుతున్నారు. ముఖ్యంగా 'శ్రీమంతుడు' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వచ్చిన 'బ్రహ్మోత్సవం' ఫ్లాప్‌ కావడం మహేష్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో దర్శకుడిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై మహేష్ బాబు స్పందించాడు. ఫ్లాప్‌లో తన తప్పు ఉందంటూ పెద్దమనసుతో క్లారిటీ ఇచ్చాడు. శ్రీకాంత్‌ను డైరెక్ట్ చేయమని తనే అడిగానని, దానికి అడ్డాలను విమర్శించవద్దని ఫ్యాన్స్‌కు చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. 
 
తన తప్పును ఒప్పుకోవడం, అందుకు వేరే వాళ్లను బాధ్యులను చేయవద్దనడం అనేది మంచి లక్షణం. ఈ మంచి లక్షణం మహేష్ బాబుకు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి వంశపారంపర్యంగా వచ్చినట్టు కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ తన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే, ఆ నిర్మాతకు మరో సినిమాను రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసేవాడని అప్పట్లో అంతా చెప్పుకునేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చిన ఆదుకునేందుకు కృష్ణ ముందుకు వచ్చేవాడు. ఆ మంచి మనసు కొడుకు మహేష్ బాబుకు కూడా రావడం గమనార్హం.