గాసిప్స్ గురించి ఆలోచించకూడదు - మీరా జాస్మిన్ (video)
గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న మీరా జాస్మిన్ మలయాళ సినిమా `మకల్`తో రాబోతుంది. ఈనెల 29న విడుదలకానున్న ఈ చిత్రంలో ఆమె జయరామ్‌తో కలిసి నటించింది. చాలా కాలంగా నటనకు దూరంగా వున్నా తనకేమీ తేడా కనిపించలేదని చెబుతోంది. సినిమాలకు గ్యాప్ తీసుకున్నట్లు లేదనీ, దుబాయ్‌లో తన భర్త అనిల్ జాన్ టైటస్‌కు చెందిన వ్యాపారపనులు చూసుకుంటున్నట్లు చెప్పింది.
గుడుంబా శంకర్, గోరింటాకు వంటి పలు చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ వైవాహిక జీవితం తర్వాత ఆడవారికి కొన్ని బాధ్యతులుంటాయని పేర్కొంది. మకల్ అనే చిత్రం హీరో బేస్డ్ సినిమా కాదు. ఇందులో కుటుంబానికి చెందిన అంశాలుంటాయి. అన్ని భాషల వారికి ఈ కథ కనెక్ట్ అవుతుందని తెలిపింది. గాసిప్ వంటి విషయాల గురించి అస్సలు ఆలోచించకూడదు. దాని గురించే ఆలోచిస్తే కెరీర్‌లో ఎదుగుదల వుండదని సూక్తి చెబుతోంది.