శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (17:34 IST)

#DrinkAndDrive : ట్రెండింగ్‌లో సాయి ధ‌రమ్ - వైవా హ‌ర్ష షార్ట్ మూవీ

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్, యూట్యూబ్ స్టార్ వైవా హర్షలు కలిసి డ్రింక్ అండ్ డ్రైవ్‌పై నటించిన షార్ట్ మూవీ ఇపుడు సోషల్ మీడియాలో ట్రిండింగ్‌లో ఉంది. వైపా హర్ష తీసిన ఈ మూవీని యూట్యూబ్‌లో అప్ లోడ్ చ

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్, యూట్యూబ్ స్టార్ వైవా హర్షలు కలిసి డ్రింక్ అండ్ డ్రైవ్‌పై నటించిన షార్ట్ మూవీ ఇపుడు సోషల్ మీడియాలో ట్రిండింగ్‌లో ఉంది. వైపా హర్ష తీసిన ఈ మూవీని యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. ఇందులో వైవా హ‌ర్ష ట్రాఫిక్ సీఐగా న‌టించాడు.
 
ఇక‌... ఆద్యంతం కామెడీని పండించే ఈ షార్ట్ మూవీలో తెలుగు యువ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్. ఆగ‌స్టు 15న యూట్యూబ్‌లో అప్ లోడ్ అయిన ఈ వీడియో ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లో ఉండ‌టం విశేషం. అంతే కాదు.. సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తుండగా మీరూ ఓ లుక్కేయండి. 
 
కాగా, వైవా హ‌ర్ష‌... వైవా షార్ట్ ఫిలింతో యూట్యూబ్ స్టార్ అయ్యాడు. దీంతో వైవా అనే యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి అప్పుడ‌ప్పుడు షార్ట్ మూవీస్ తీసి అందులో అప్ లోడ్ చేస్తుంటాడు. మ‌నోడి‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆ కోవలోనే ఈ డ్రింక్ అండ్ డ్రైవ్‌పై తీసిన షార్ట్ మూవీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.