బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2024 (16:51 IST)

డ్రింకర్ సాయి బ్యాడ్ బాయ్స్ బ్రాండ్ తో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు

Dharma,
Dharma,
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 
ఈరోజు  "డ్రింకర్ సాయి" సినిమా రిలీజ్ డేట్ ను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నెల 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. "డ్రింకర్ సాయి" టీజర్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన 'బాగి బాగి..' లిరికల్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. "డ్రింకర్ సాయి" సినిమా యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
 
నటీనటులు - ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు