మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (12:20 IST)

ఈడీ విచారణకు నవదీప్.. ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా..?

Navadeep
ఈడి విచారణకు కాసేపటి క్రితమే హీరో నవదీప్ హాజరైయ్యారు. హీరో నవదీప్ సెంటర్‌గా ఈడీ విచారణ కొనసాగుతోంది. హీరో నవదీప్, కెల్విన్ ఆధారంగా సినీ ప్రముఖులను విచారిస్తున్నారు ఈడి అధికారులు. 2017 నుంచి 18వరకు నవదీప్ నటించిన ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
డ్రగ్స్ కేసు వెలుగులోకి రాగానే పబ్‌ను మూసి వేశాడు నవదీప్.. అయితే ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్‌కి కెల్విన్‌కి మధ్య లావాదేవిలు జరగినట్లు కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. 
 
ఎఫ్ లాంజ్ పబ్బులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 2015 నుంచి 17 వరకు పంపు కేంద్రంగానే డ్రగ్స్ దందా గుర్తించారు ఈడీ అధికారులు. కాగా ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. ఇప్పటికే పూరీ, ఛార్మి, రానా, రవితేజ, రకుల్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.