శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By JSK
Last Modified: సోమవారం, 24 అక్టోబరు 2016 (19:31 IST)

డ్రగ్స్ రాకెట్ కేసులో నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు.. దాని వెనుకున్న ఓ సినీ నిర్మాత, మరో అసిస్టెంట్ డైరెక్టర్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని నెల్లూరుకు చెందిన నిర్మాత వెంకట సురేష్, యూసుఫ్‌గూడకు చెందిన కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా గు

హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు.. దాని వెనుకున్న ఓ సినీ నిర్మాత, మరో అసిస్టెంట్ డైరెక్టర్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని నెల్లూరుకు చెందిన నిర్మాత వెంకట సురేష్, యూసుఫ్‌గూడకు చెందిన కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా గుర్తించిన పోలీసులు వారి నుంచి కిలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులని రిమాండ్‌కి తరలించిన పోలీసులు... వారి వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ని పరిశీలన నిమిత్తం ల్యాబ్‌కి తరలించినట్టు తెలిపారు.
 
వెంకట సురేష్, కిషోర్‌లు విద్యార్థులకి డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నట్టు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాలో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద వున్న 1.5 కిలోల కిటామైన్ అనే మత్తు పధార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న ఈ మొత్తం డ్రగ్స్ విలువ రూ.6 కోట్లు వుంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ ముఠా బీటెక్‌ విద్యార్థులను టార్గెట్‌ చేస్తున్నారని తెలిపారు.