శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మే 2020 (14:18 IST)

నిర్మాతల సంక్షేమం కోరి... రెమ్యునరేషన్ తగ్గించుకున్న తాప్పీ

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. అనేక వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోయాయి. అదేసమయంలో మరో ఆర్నెల్ల పాటు సినీ థియేటర్లలో బొమ్మపడే అవకాశాలు లేవని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సినీ హీరోలు, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవాలంటున్న డిమాండ్లు తెరపైకి పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు హీరోయిన్లు, హీరోలు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఆ కోవలో ఢిల్లీ పిల్ల తాప్పీ కూడా తన పారితోషికం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించారు. 
 
ఇప్పటికే, తమిళ దర్శకుడు హరి తన రెమ్యునరేషన్‌లో 25 శాతం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే తమిళ హీరో హరీష్‌ కల్యాణ్‌ (జెర్సీ చిత్రంలో హీరో నాని కుమారుడిగా కనిపించిన), తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ కూడా తన రెమ్యూనరేషన్‌లో 25 శాతం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇపుడు తాప్పీ పన్ను కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, మరికొందరు హీరోలు, హీరోయిన్లు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.