మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (18:23 IST)

దుల్కర్ సల్మాన్, మమ్ముట్టిలకు ప్రమోషన్.. అమల్ సుఫియాకు పండంటి పాప పుట్టిందోచ్

సీనియర్ యాక్టర్, మలయాళ నటుడు మమ్ముట్టికి ప్రమోషన్ వచ్చింది. ఆయన తాతయ్య అయ్యాడు. తన కుమారుడు, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో దుల్కర్ సల్మాన్ సతీమణి అమల్ సుఫియా పండంటి పాపకు జన్మనిచ్చింది.

సీనియర్ యాక్టర్, మలయాళ నటుడు మమ్ముట్టికి ప్రమోషన్ వచ్చింది. ఆయన తాతయ్య అయ్యాడు. తన కుమారుడు, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో దుల్కర్ సల్మాన్ సతీమణి అమల్ సుఫియా పండంటి పాపకు జన్మనిచ్చింది. తద్వారా దుల్కర్‌కు తండ్రిగా, మమ్ముట్టికి తాతయ్యగా ప్రమోషన్ లభించింది. దుల్కర్ నిత్యామీనన్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో ఓకే బంగారం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. 
 
మలయాళంతో పాటు దక్షిణాది సినిమాల్లో యంగ్ హీరోగా మంచి పేరు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో ఈ యంగ్ స్టార్ తండ్రి అయ్యాడన్న వార్త వినగానే మూలీవుడ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సెలెబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. 
 
2011 డిసెంబర్ 22న అమల్, దుల్కర్ వివాహం జరిగింది. సోషల్ మీడియాలో ఈ జోడీ చూడచక్కని జంటగా పేరు కొట్టేసింది. వీరిద్దరి పోస్టులు, ట్వీట్లు నెటిజన్ల ఆదరణ పొందాయి. దుల్కర్‌-అమల్‌కు పాప పుట్టిందన్న విషయాన్ని దుల్కర్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు.