మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (14:28 IST)

లైగర్ చిత్ర నిధులపై పూరీ జగన్నాధ్, ఛార్మీలను ఈడీ దర్యాప్తు

liger team
liger team
ఆ మధ్య డ్రగ్ కేసులో సెలెబ్రెటీస్ అరెస్ట్ చేసి విచారణ చేశారు. అందులో పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ కూడా వున్నారు. మల్లి తాజాగా వారిని విచారిస్తున్నారు. అందులో ప్రదానంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన లైగర్ చిత్ర పెట్టుబడిపై ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ ఈరోజూ ఆరాతీసినట్లు తెలిసింది. లైగర్ సినిమాను ఊహించని విధంగా లావిష్ గా తీయడమే కాకుండా మైక్ టైసన్ ను కూడా పెట్టి తీశారు.  సినిమా ప్రచారం కోసం స్పెషల్ జెట్ ను కూడా ఉపయోగించారు. అదే స్పీడ్ ను జన గణ మన సినిమా ఓపెనింగ్ కూ భారీగా ఖర్చు పెట్టారు. అప్పట్లో భారీతనానికి తెలుగు పరిశ్రమ ఆర్చర్యపోయింది. 
 
కాగా, లైగర్  కోసం నిధులు  సమకూర్చడానికి ఉపయోగించే డబ్బు విదేశీ మూలం నుండి వచ్చిందని, ఇది 1999 నాటి ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ని ఉల్లంఘించిందని రిపోర్టులు రావడంతో, ED తమ పెట్టుబడిదారుల గుర్తింపును నిర్ధారించడానికి పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్‌లను పిలిపించింది. 
  
"ఈడీ అధికారులు,లైగర్ సినిమాకు నిధులు సమకూర్చిన కంపెనీ లేదా వ్యక్తుల పేరును తెలుసుకోవాలనుకున్నారు. సినిమాకి నిధులు సమకూర్చడానికి ఉపయోగించిన డబ్బు విదేశాల నుండి వచ్చిందని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ నిధులలో ఏదైనా ఉల్లంఘన జరిగిందా అని తనిఖీ చేస్తున్నారు. చిత్రనిర్మాత ద్వయంను  దాదాపు 12 గంటల పాటు విచారణ చేసారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ నల్లధనాన్ని సినిమా కోసం పెట్టుబడి పెట్టారని గతంలోనే కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
 
 విజయ్‌పై ఈ ప్రాజెక్ట్‌పై మూడేళ్లు వెచ్చించిన పెట్టుబడి వృధాఅని సినిమా ఫెయిల్ తర్వాత ప్రేక్షకుల నుండి స్పందన వచ్చింది. దీనిపై రక రక కథనాలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. ఇక, లైగర్ విడుదలకు ముందే, విజయ్, పూరి కలిసి జన గణ మన అనే మరో ప్రాజెక్ట్‌లో పని చేస్తారని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2023లో విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.అయితే, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది.