శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (17:36 IST)

ఇటలీలో మహేష్ బాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Maheshbabu,looking new movie
రాంచరణ్- ఉపాసన తమ 10వ పెళ్లి రోజు వేడుకలు ఇటలీలో సెలెబ్రేట్ చేసుకున్న తరహాలో.. ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఇటలీలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రాంచరణ్ కంటే కొన్ని రోజుల ముందుగానే మహేష్ బాబు కూడా ఇటలీకి వెళ్ళాడు.
 
'సర్కారు వారి పాట' రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఫ్యామిలీతో ఇటలీకి వెళ్ళాడు మహేష్. అక్కడ మహేష్ తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.
 
తాజాగా తన ఫ్యామిలీతో మహేష్ బాబు తీసుకున్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు మహేష్ బాబు. 'ఇది రోడ్‌ ట్రిప్‌. నెక్ట్స్‌ స్టాప్‌ ఇటలీ. లంచ్‌ విత్‌ ది క్రేజీస్‌' అంటూ రాసుకొచ్చాడు.
 
ఈ ఫొటోలో మహేష్‌తో పాటు నమ్రతా శిరోద్కర్‌, గౌతమ్‌, సితారల హెయిర్ స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.