ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (15:08 IST)

ఒంటరిగా వున్నా- అయినా స‌వాళ్ళ‌ను ఎదుర్కొన్నా- శోభితా ధూళిపాళ

Shobhita Dhulipal
శోభితా ధూళిపాళ భారతీయ మోడల్, సినీ నటి. ఆమె 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. తెలుగు గూఢ‌చారి సినిమాలో న‌టించింది. హిందీ, మ‌ల‌యాళంలో ప‌లు సినిమాలు చేసిన ఆమెకు భాష మొద‌ట్లో స‌మ‌స్య‌గా మారింద‌ట‌. ఇటీవ‌లే సోష‌ల్ మీడియాలో హాట్ పొటోల‌ను పెడుతూ ఫాలోయింగ్‌ను పెంచుకుంది.  తాజాగా వోగ్ ఇండియా ఫిబ్రవరి 2022 కవర్ పేజీ లో ఆమె ఫొటో ప్ర‌చురిత‌మైంది. అందులో ఆమె త‌న అనుభ‌వాల‌ను చెప్పుకొచ్చింది.
 
నేను ఒంటరిగా ఉన్నాను. ఏదీ నేను అనుకుని జ‌ర‌గ‌లేదు. పుట్టింది తెలుగు గ‌డ్డ‌మీద అయినా ముంబైలో నాకు స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఎన‌క‌మిక్స్ పూర్తిచేశా. భ‌ర‌త‌నాట్యం అంటే ఇష్టం. అదే న‌న్ను గ్లామ‌ర్ రంగంపై కి వ‌చ్చేలా చేసింది. నేను ఒంట‌రిగా వున్నా ఎవ‌రిని ప్రేమించ‌లేదు. నాపై వ‌చ్చిన పుకార్ల‌కు పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ని క్లారిటీ ఇచ్చింది. న‌టిగా .జ‌ర్నీలో ఎన్నో విష‌యాలు తెలుసుకున్నాన‌ని పేర్కొంది. వోగ్‌లో గ‌మ్మ‌త్తైన ఫొటోను ప్ర‌చురించిన ఫొటోగ్రాఫ‌ర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. తాజాగా  ఆదిత్య రాయ్ కపూర్,  అనిల్ కపూర్ కాంబినేష‌న్‌లో భారీ  ప్రాజెక్ట్‌లో ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపింది.