గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (14:37 IST)

పెండ్లి చేసుకున్నా ఇద్ద‌రం న‌టిస్తాం- ఆది పినిశెట్టి

Adi Pinishetti, Nikki Galrani
Adi Pinishetti, Nikki Galrani
హీరో క‌మ్ విల‌న్ ఆది పినిశెట్టి. ర‌విరాజా పినిశెట్టి కుమారుడు. ఇటీవ‌లే హారోయిన్ నిక్కీ గ‌ల్రానీని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి ప‌రిమిత సంఖ్య‌లోనే కోవిడ్ వ‌ల్ల పిల‌వ‌లేక‌పోయామ‌ని తెలియ‌జేస్తున్నారు. ఆయ‌న తాజాగా న‌టించిన సినిమా `ది వారియ‌ర్‌`. రామ్ పోతినేని హీరో. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టించాడు.
 
- ఈ సినిమాను మా అమ్మ‌గారు, మేన‌ల్లుడు థియేట‌ర్‌లో చూసి నాకు భ‌య‌మేసింద‌రా అంటూ చెప్పారు. అంత‌లా పాత్ర‌లో భ‌య‌పెట్టావ‌నిచెబుతుంటే పాత్ర‌కు న్యాయం చేశాన‌ని అనిపించింది. మా ఫాద‌ర్ మాత్రం ఓకే ప‌ర్లేదు అన్న‌ట్లుగా ఫీలింగ్ పెట్టారు అంటూ విలేక‌రుల‌తో పంచుకున్నారు.
 
- పెండ్లి గురించి మాట్లాడుతూ, క‌రోనా వాతావ‌ర‌ణంలో పెండ్లి చేసుకున్నాం. నిక్కీ గ‌ల్రానీ, నేను `మ‌లుపు` అనే సినిమాలో 2015లో న‌టించాం. అప్ప‌ట్లో ఇద్ద‌రం ప్రేమించుకోలేదు. కానీ ఆ త‌ర్వాత త‌ర్వాత ఆమె ప్రేమిస్తున్న‌ట్లు చెబుతుంటే నేను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఆమె సిన్సియారిటీ, న‌డ‌త న‌చ్చి నేను అంగీక‌రించాను. ఇప్పుడు చాలా హ్యాపీగా వున్నాం. ఇరుకుటుంబాల‌వారు చాలా ఆనందంగా వున్నారు. నేను నిక్కీ క‌లిసి ఓ సినిమాలో న‌టించాం. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతుంది. నిక్కీ న‌ట‌న‌కు దూరంకాదు. త‌ను న‌టిస్తుంది అని క్లారిటీ ఇచ్చారు.