గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (19:13 IST)

"ఎఫ్-3" నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్... MONEY ANTHEM వచ్చేసిందిగా? (వీడియో)

F3
"ఎఫ్-3" నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం 'ఎఫ్ 2' కు ఇది సీక్వెల్. సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 'ఎఫ్ 2'కు మూడు రెట్లు ఎక్కువ వినోదంతో ఈ సీక్వెల్ 'ఎఫ్ 3' సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. 
 
సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాల వల్ల వాయిదా పడింది. కానీ ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్  'లబ్ లబ్ లబ్ లబ్ డబ్బు' ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. మనీకి అంతం లేదు.. ఈ MONEY ANTHEMకి తిరుగు లేదు అంటూ ఈ పాట సాగుతోంది.