సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (19:53 IST)

రణస్థలిలో ఫైట్ సీక్వెన్స్ హైలైట్ - ద‌ర్శ‌కుడు క్రిష్‌

Krish-Ranastali poster
Krish-Ranastali poster
ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ, ప్రశాంత్, శివ జామి ,నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా నటించిన చిత్రం రణస్థలి ఫస్ట్ లుక్ పోస్టర్ డైరెక్టర్ క్రిష్ జాగార్లమూడి రిలీజ్ చేయటం జరిగింది, హీరో నాగశౌర్య నటించిన "అశ్వథ్థామ"సినిమాకి మాటల రచయితగా పని చేసిన పరుశరాం  శ్రీనివాస్ దర్శకత్వంలో సురెడ్డి విష్ణు నిర్మించిన చిత్రం "రణస్థలి". ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో  నిమగ్నమయి వున్నారు, ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టుడియోస్‌ లో ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చేతుల మీదుగా "రణస్థలి" చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు జాగర్లమూడి క్రిష్  మాట్లాడుతూ.. "రణస్థలి" సినిమా రఫ్ కట్ టీజర్ చూస్తుంటే టైటిల్ కు తగ్గట్టుగా సినిమా టీజర్ అద్భుతంగా కూడా చాలా బాగుంది.  చిన్న సినిమాలో ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు.సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని  సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకునే టీం తపన నాకు  చాలా నచ్చింది. డైలాగ్స్ వింటుంటే కేజీఎఫ్ లెవెల్ లో ఇంపాక్ట్ ఇస్తున్నాయి. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు.ఈ సినిమా టీం అందరికీ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను  అన్నారు.
 
దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..మా  రణస్థలి చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకుడు క్రిష్  గారికి ధన్యవాదాలు.ప్రేక్షకులు. "అశ్వథ్థామ"సినిమాకి మాటల రచయితగా పని చేసిన పరశురామ్ శ్రీనివాస్ ఈ సినిమాకు రచన దర్శకత్వం చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము క్రిష్ గారికి రఫ్ కట్ టీజర్ ను చూపించడం జరిగింది. అది చూసిన క్రిష్ గారు హర్షం వ్యక్తం చేసి ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని డైరెక్టర్ ని మెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా వారంతా అద్భుతంగా నటించారు.ప్రతి క్యారెక్టర్ లో కూడా క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప ఆర్టిస్టులు కనిపించరు.సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత వారి క్యారెక్టర్ లు మీతోనే ఉంటాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ బయటకు వచ్చిన తరువాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మా సినిమా చూసిన తరువాత  ప్రేక్షకులకు చిన్న సినిమాపై వుండే చులకన భావం పోయేలా మా సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను.సంగీత దర్శకుడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు.ఇలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన  సురెడ్డి విష్ణుకు ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ చూసి ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాత సురెడ్డి విష్ణు మాట్లాడుతూ..డీఫ్రెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాకు టీం అంతా ఎంతో కష్టపడి  పూర్తి చేశాము. నటీనటులు, టెక్నిసిషన్స్ అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్  చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ మంచి అనుభూతిని పొందుతారని ఖచ్చితంగా చెప్పగలను.ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు