శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (13:57 IST)

చిన్న వయసులో కంటికి అన్నీ మంచిగానే కనిపిస్తాయ్.. రక్షిత్‌తో అలా పరిచయమైంది...

'గీత గోవిందం' హీరోయిన్ రష్మిక మందన్నా. ఆ తర్వాత "దేవదాస్" చిత్రంలో హీరో నాని సరసన నటించింది. అయితే, ఈమెకు కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి అది నిశ్చితార్థంవరకు వెళ్లింది. ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుంది.
 
ఈ నేపథ్యంలో రక్షిత్ శెట్టితో పరిచయం ఎలా ఏర్పడింది.. నిశ్చితార్థం రద్దు దారితీసిన పరిస్థితులపై రష్మిక తాజాగా స్పందించింది. 'కిరిక్ పార్టీ' స‌మ‌యంలో త‌న‌కి ర‌క్షిత్ శెట్టితో ప‌రిచ‌యం ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారిందని చెప్పింది. ఇదే విష‌యాన్ని అమ్మ‌కి చెప్ప‌డంతో నీ నిర్ణ‌యం స‌రైన‌ద‌ని భావిస్తే.. నీకు న‌చ్చిన‌ది చేయ్ అని చెప్పింద‌ని ర‌ష్మిక వెల్లడించింది. 
 
అయితే వయసులో ఉన్నప్పుడు మన కంటికి అన్నీ మంచిగానే కనిపిస్తాయనీ, తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలకు ఏది మంచిదో గుర్తించగలరని రష్మిక చెప్పింది. అంతా బాగా ఉన్నప్పుడు ఓ బంధాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. కానీ పొరపాట్లు, లోటుపాట్లు కనిపిస్తే, దాన్ని అక్కడితో వదిలేయడం మంచిది. లేదంటే భవిష్యత్‌లో చాలా కోల్పోతాం అని రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది.