శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మే 2021 (09:28 IST)

పడకసుఖం ఇవ్వాలంటూ బ్యూటీషన్‌కు వేధింపులు - కంగనా బాడీగార్డ్‌పై కేసు

బాలీవుడ్ న‌టి వివాదాస్పద నటి కంగ‌నా ర‌నౌత్‌కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త లైమ్ లైట్‌లోకి వ‌స్తూ ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే ఈ సారి కంగ‌నా బాడీగార్డుకు సంబంధించిన హాట్ న్యూస్ ఒక‌టి బీటౌన్‌లో హాల్చల్ చేస్తోంది. 
 
కంగ‌నా బాడీడార్డు కుమార్ హెగ్డేపై ఓ చీటింగ్ కేసు న‌మోదైంది. ముంబైలోని డీఎన్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుమార్ హెగ్డే పెళ్లి పేరుతో త‌న‌తో ఎనిమిదేళ్లు సహజీవనం చేసి, మోసం చేశాడ‌ని ఆరోపిస్తూ ఓ బ్యుటీషియన్ ఫిర్యాదు చేసింది. 
 
బీటౌన్ స‌మాచారం మేర‌కు కుమార్ హెగ్డే, స‌ద‌రు బాధితురాలు ఎనిమిదేళ్లుగా ఒక‌రికొక‌రు తెలుసు. ఇద్ద‌రూ లివ్ ఇన్ రిలేష‌న్ షిప్‌లో ఉన్నారు. గతేడాది జూన్‌లో కుమార్ హెగ్డే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆ 30 ఏళ్ల బ్యూటీషియన్ తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
కంగనా బాడీగార్డు కుమార్ హెగ్డే శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేసేవాడని, అందుకు నిరాకరించడంతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బ్యూటీషియన్ ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు, ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్టు తెలిపారు. అయితే దీనిపై కంగ‌నా ర‌నౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.