వర్జిన్ బాయ్స్ లాటరీలో ఐఫోన్ గెలుచుకున్న తొలి ప్రేక్షకుడు
'టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు, మనీ రైన్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకుల్లోకి చొచ్చుకుని పోయింది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. దీంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఎక్కడ చూసిన వర్జిన్ బాయ్స్ గురించి చర్చ నడుస్తోంది. ఇది మా టీమ్ అందరిలో నూతన ఉత్సాహాన్ని పెంచింది అని నిర్మాత రాజా దారపునేని అన్నారు. దయానంద్ రచనా దర్శకత్వంలో రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మించిన చిత్రం వర్జిన్ బాయ్స్. బిగ్‌బాస్ ఫేం మిత్ర శర్మ, గీతానంద్ జంటగా నటిస్తుండగా శ్రీహాన్, కౌశల్, రోనీత్, జెనీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లూ, అభిలాష్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 11న గ్రాండ్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
గురువారం మాదాపూర్ ప్రాంతంలో ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్న మిత్ర శర్మ, వర్జిన్ బాయ్స్ టీం అడ్వాన్స్ టికెట్ తీసుకున్న వారిని వివరాలతో లాటరీ తీయగా చందా నగర్ కు చెందిన ప్రవీణ్ ఐఫోన్ గెలుచుకున్నారు. ఇది మొదటి ఫోన్ మాత్రమే. ఇంకా దాదాపు పది లాటరీస్ ఉన్నాయని టీం తెలిపారు.
అలాగే టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు, మనీ రైన్ కాన్సెప్ట్స్ గురించి కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే పాజిటివ్ స్పందిస్తూ ఆ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు. జనాలను థియేటర్లకు రప్పించాలనే ఈ ప్రయత్నం. ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్‌కు మంచి బజ్ వచ్చింది. సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. అలాగే మాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అలాగే కొంతమంది థియేటర్లలో మనీ రైన్ పడితే తొక్కిసలాట జరుగుతుంది కదా, ప్రేక్షకులకు ఇబ్బంది అయితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మనీ రైన్ కాన్సెప్ట్ విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మనుషుల విలువ, డబ్బులు విలువ తెలిసినవాళ్లం. అన్ని చాలా జాగ్రత్తగా ప్రొపర్ వేలో ప్లాన్ చేశాం. మనీ రైన్ ఎక్కడా ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. అందరికీ మనీ ఎలా ఇస్తాం అనేది థియేటర్‌లో చూస్తారు. నెగటివ్ కామెంట్ చేసేవారికి ఇది విన్నపం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చక్కని స్పందన లభించింది. సినిమా అంతకు మించి ఆకట్టుకుంటుంది. ఓటీటీ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి అని అన్నారు.