శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:18 IST)

రాంగోపాల్ వర్మకు అంత్యక్రియలు పూర్తి...?

దర్శకుడు రాంగోపాల్ వర్మకు అంత్యక్రియలు పూర్తవ్వడమేంటి అనుకుంటున్నారా..? ఆశ్చర్యపోకండి.. ఇప్పటికే జీఎస్టీ సినిమాతో చిక్కుల్లో పడ్డ రాంగోపాల్ వర్మపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా

దర్శకుడు రాంగోపాల్ వర్మకు అంత్యక్రియలు పూర్తవ్వడమేంటి అనుకుంటున్నారా..? ఆశ్చర్యపోకండి.. ఇప్పటికే జీఎస్టీ సినిమాతో చిక్కుల్లో పడ్డ రాంగోపాల్ వర్మపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైజాగ్‌లో అయితే వర్మపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒక మహిళా సంఘం నేతతో వర్మ హీనంగా మాట్లాడటమే కాకుండా ఆమెను పెట్టి మరో పోర్న్ సినిమాతీయనడానికి సిద్ధంగా ఉన్నానని వర్మ చెప్పడమే గొడవకు ప్రధాన కారణమైంది.
 
తిరుపతిలో మహిళా సంఘాలు వర్మపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వర్మ చిత్రపటాలను చేతిలో పట్టుకుని అంత్యక్రియలు చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం ముందు రాంగోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన మహిళలు వర్మా చనిపోయావా? అంటూ వినూత్నంగా ఏడుస్తూ నిరసన తెలిపారు. మహిళలను అసభ్యకరంగా చూపిస్తూ సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్న రాంగోపాల్ వర్మను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.