నేను రాముణ్ణి కాదు.. హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయి : 'గరుడవేగ' హీరో

ఆదివారం, 12 నవంబరు 2017 (15:38 IST)

rajasekhar

"పీఎస్వీ గరుడవేగ" చిత్రం విజయంమత్తులో ఉన్న హీరో డాక్టర్ రాజశేఖర్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. హీరోయిన్ జీవితను పెళ్లి చేసుకోకముందు, వివాహం చేసుకున్న తర్వాత కూడా తనకు పలువురు హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గత కొన్నేళ్లుగా విజయం కోసం పరితపిస్తూ వచ్చిన రాజశేఖర్‌కు 'గరుడవేగ' సినిమాతో సక్సెస్ బాట పట్టారు. ఈ విజయం ఆయనకు చాలా ఆత్మస్థైర్యాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, తనతల్లి మరణం తనను కుంగదీస్తే.. ఈ సినిమా విజయం ధైర్యాన్నిచ్చిందని అన్నారు. గతంలో చాలా రోజుల కిందట తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తారా చౌదరితో సంబంధాలున్నాయట కదా? అన్న ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు.
 
తానేమీ రాముడిని కాదని అన్నారు. పెళ్లికి ముందు కొందరితో సంబంధాలున్నాయని చెప్పేశారు. అలాగే జీవితతో పెళ్లి తర్వాత కూడా కొందరితో సంబంధాలున్నాయని ఆయన నిజాయతీగా ఒప్పుకున్నారు. కానీ తారా చౌదరితో మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనతో ఆమె ఒకసారి ఫోటో దిగిందని, అప్పుడే ఆమెను తొలిసారి చూశానన్నారు. అంతేకానీ, తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని ఆయన స్పష్టంచేశారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లక్ష్మీ పార్వతికి కేతిరెడ్డి వార్నింగ్... ఆమె నిజస్వరూపం బయటపెడతాం

స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతికి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్ర ...

news

హీరోలు రాజకీయాల్లోకి రావడం దేశానికి విపత్తు: ప్రకాశ్ రాజ్

తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ...

news

ఆ హీరోతో తొలి ముద్దు అనుభవం మరిచిపోలేను : మాజీ మిస్ ఉత్తరాఖండ్

తెలుగు చిత్రపరిశ్రమలో అచ్చతెలుగు ఆడపిల్లగా కనిపించే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. ...

news

నేను నా మతాన్ని కోల్పోతున్నాను : రణ్‌వీర్

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్, దీపికాలు నటించిన తాజా చిత్రం "పద్మావతి". సంజయ్ లీలా భన్సాలీ ...