శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 12 జనవరి 2017 (06:53 IST)

గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ రిపోర్ట్: బడుగు జాతి కాదు తెలుగు జాతి.. ఇద్దరు చంద్రులకు థ్యాంక్స్ చెప్తూ..?

పదేళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో సంక్రాంతికి పోటీ పడేందుకు బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా పెద్ద హీరోల మధ్య ఈ సినిమాల ద్

సినిమా పేరు : గౌతమిపుత్ర శాతకర్ణి 
తారాగణం: బసవపుత్ర బాలకృష్ణ, శ్రియా శరన్, హేమమాలిని, శివ రాజ్‌కుమార్
సంగీతం : చిరంతన్ భట్
దర్శకత్వం : రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్)
ప్రొడ్యూసర్స్ :  సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి
విడుదల తేది : జనవరి 12, 2017
 
పదేళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో సంక్రాంతికి పోటీ పడేందుకు బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా పెద్ద హీరోల మధ్య ఈ సినిమాల ద్వారా పోటీ నెలకొంది. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవిత గాధ ఆధారంగా తెరకెక్కింది. గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య వీరత్వం చూపించబోతున్నాడు.
 
ఆయన భార్య వశిష్టాదేవిగా శ్రియా కనిపించింది. శాతకర్ణి తల్లి గౌతమిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించింది. 'ప్రజలు కొట్టుకోవడం లేదు. అధికారం చెలాయించడానికి పాలకులు కొట్టుకుంటున్నారు'. చిన్నప్పుడే ఈ విషయాన్ని గ్రహించిన శాతకర్ణి.. 33గణ రాజ్యాలుగా ఉన్న భారతాన్ని ఏకం చేశాడు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్స్, టీజర్స్‌లో బాలయ్య వీరత్వం, పాత్రల గొప్పదనం స్పష్టంగా కనిపించింది. 
 
సంగీతం వీణుల విందుగా ఉన్నాయి. సాయి మాధల్ డైలాగ్స్ సూపర్ అనిపించాయి. కెమెరా పనితనం, దర్శకత్వం సూపర్ అనిపించాయి. సంక్రాంతి రేసులో ముందే వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' సూపర్ హిట్ అని తేలిపోయింది. దీంతో.. నందమూరి అభిమానులపై కాస్త ఒత్తిడి పెరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ టాక్ సొంతం చేసుకొంటే మెగా అభిమానులతో కలసి కాలరేగరేయొచ్చని అని బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్నారు.
 
చరిత్రలో ఎదురులేని 'గౌతమిపుత్ర శాతకర్ణి' వెండితెరపై ఏం చేశాడు. వెండితెరపై బాలయ్య వీరత్వం ప్రేక్షకులని తప్పక మెప్పిస్తుందని టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో గ్రాండ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. అద్భుతమైన డైలాగులు, బీజీఎంలు పాజిటివ్ టాక్‌ను సంపాదించుకున్నారు. వార్ ఎపిసోడ్ సాగదీసినట్లుంది. సెకండాఫ్‌లో యుద్ధసన్నివేశాలు సాగదీతగా కనిపించాయి. క్లైమాక్స్ హృదయానికి హత్తుకుపోయేలా ఉంది. బడుగుజాతికాదు తెలుగు జాతి అనే డైలాగ్స్ అదిరిపోయాయి. వార్ సందర్భంగా సాగే పాటలు బాగున్నాయి. శాతకర్ణి ఎంట్రీని క్రిష్ అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు కృతజ్ఞతలు చెప్తూ సినిమా ప్రారంభం అవుతుంది.