శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 22 మే 2021 (19:33 IST)

గీతా ఆర్ట్స్ సినిమాలు ఓటీటీకి ఇవ్వ‌డంలేదుః అల్లు అర‌వింద్‌

Allu aravind
ఇటీవ‌ల థియేట‌ర్లు మూత‌ప‌బ‌డ్డాయి. ఓటీటీ విస్త‌రించింది. అందుకే సినిమాల‌న్నీ ఓటీటీ బాట ప‌డుతున్నాయ‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీనిపై గీత ఆర్డ్స్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. గీతా ఆర్ట్స్ లో నిర్మాణమవుతున్న ఏ సినిమా కూడా ఎక్సక్లూజివ్ గా ఓటిటి కి ఇవ్వాలనే నిర్ణయం తీసుకోలేదు. ఏదన్నా నిర్ణయాన్ని తీసుకుంటే ముందుగానే తెలియ‌జేస్తామ‌ని శ‌నివారం సాయంత్రం ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.
 
ఇదిలా వుండ‌గా, క‌రోనా వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో థియేట‌ర్లు మూత‌ప‌బ‌డ్డాయి. వీటిపై అల్లు అర‌వింద్ ఓ ఇంట‌ర్వ్యూలో ఇలా తెలియ‌జేశారు. నేనెప్పుడూ థియేట‌ర్లోనే సినిమా చూడాలంటాను. ఎవ‌రైనా వారి సినిమాలు ఓటీటీకి ఇచ్చారంటే అది వారి వ్య‌క్తిగ‌తం. కొంత‌మంది నిర్మాత‌లు ఓటీటీ కోస‌మే సినిమాలు తీస్తున్నారు. వారి కోసం కొన్ని ఓటీటీలు వున్నాయి. ఇప్పుడు ఎంట‌ర్‌టైన్‌మెంట్ బాగా విస్త‌రించింది. దేశ‌వ్యాప్తంగా దాని ప్ర‌భావం వుంది అని తెలియ‌జేస్తున్నారు.