సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (12:21 IST)

గీత గోవిందం.. నాగబాబు డబ్బింగ్ చెప్పలేదట.. ఎందుకో తెలుసా?

అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ''గీత గోవిందం'' సినిమా యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ నెల 15వ తేదీన భారీస్థాయిలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ చిత్రంలో నాగబాబు ఓ

అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ''గీత గోవిందం'' సినిమా యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ నెల 15వ తేదీన భారీస్థాయిలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ చిత్రంలో నాగబాబు ఓ కీలక పాత్రను పోషించారు.


అయితే ఆయన పాత్రకి వేరెవరో డబ్బింగ్ చెప్పడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఆజానుబాహుడైన నాగబాబుకి అందుకు తగిన గంభీరమైన వాయిస్ వుంది. తన డైలాగ్ డెలివరీతో ఆయన సన్నివేశాలకి బలాన్ని చేకూర్చేవారు. 
 
అలాంటి నాగబాబు కొన్ని నెలలుగా గొంతుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. అందుకే ఆయన స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. గట్టిగా కూడా మాట్లాడలేకపోతున్నారు.

ఈ విషయం ''జబర్దస్త్'' కామెడీ షోను వీక్షించే వారందరికీ బాగా తెలుసు. మిగతావారే ఆయన పాత్రకి వేరే వారి డబ్బింగ్‌ను అంగీకరించలేకపోయారు. నాగబాబు గొంతు సమస్య కారణంగానే ఆయన పాత్రకి వేరేవారితో డబ్బింగ్ చెప్పించారట. అలా నాగబాబు రోల్‌కు గీత గోవిందం కోసం డబ్బింగ్ పూర్తయ్యిందట.