డ్రగ్స్ కేసు : సిట్ ముందుకు గాయని గీతామాధురి భర్త...

మంగళవారం, 1 ఆగస్టు 2017 (10:41 IST)

nandu

హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగియనుంది. సినీ ప్రముఖుల్లో చివరివాడైన గాయని గీతామాధురి భర్త నందు కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నాడు. తన తండ్రి, మేనమామతో కలసి సిట్ కార్యాలయానికి వచ్చాడు. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ మొబైల్ ఫోన్‌లో నందు నంబర్ ఉండటం, వారిద్దరి మధ్యా జరిగిన వాట్స్ యాప్ సంభాషణల ఆధారంగా నందును విచారణకు పిలిపించిన అధికారులు, సుమారు 60 వరకూ ప్రశ్నలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత అరెస్టుల పర్వం కొనసాగవచ్చని తెలుస్తోంది. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు, హీరోలు తరుణ్, నవదీప్, రవితేజ, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్, ఛార్మీ తదితరులు విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై మరింత చదవండి :  
Husband Nandu Appear Sit Investigation Geetha Madhuri

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రతి ఇంటికి 'జ‌వాన్'లాంటోడు ఒక్కడుండాలి.. టీజ‌ర్ అదుర్స్ (Teaser)

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా నటిస్తున్న చిత్రం "జవాన్". బీవీఎస్ రవి ...

news

'స్పైడర్‌'లో 8 మినిట్స్ ఫైట్ కోసం రూ.20 కోట్లు ఖర్చు

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం ...

news

మలయాళం, తెలుగు చిత్రసీమల్లో విజయ దుందుభి.. సూర్యపై కన్నేసిన సాయిపల్లవి

ఫిదా చిత్రం విజయ సంబరాల్లో ఊపిరి తిరగకుండా పాల్గొంటున్న సాయిపల్లవి తమిళ చిత్రరంగంపై ...

news

ఈ స్పైడర్ ప్రయోగాలు, స్టంట్‌లు మహేష్ కొంప ముంచుతాయా లేపుతాయా.. కథ ఉందా అసలు?

స్పైడర్ సినిమా షూటింగులో మహేష్ బాబు ఫైటింగ్ సీన్లను, యాక్షన్ సీన్లను అద్భుతంగా ...