ఉచితంగా వాక్సిన్ వేసుకోండి: చిరంజీవి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 24 శాఖలకు చెందిన కార్మికులకు కరోనా కాలంలో సి.సి.సి. ఆధ్వర్యంలో అందరికీ నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్‌బాబుతోపాటు పలువురు ప్రముఖులు ట్రస్టీగా ఏర్పడి కరోనా క్రైసెస్ ఛారిటీ పేరుతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కరోనా వెసులుబాటు ఇవ్వడంతో యథావిధిగా కార్మికులు తన విధులకు హాజరయి షూటింగ్‌లు జరుపుకున్నారు. కానీ మరలా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడంతో మరలా సి.సి.సి. ముందుకు వచ్చి కార్మికులందరికీ కరోనా వేక్సిన్ ఉచితంగా వేసుకునే వెసులుబాటు కల్పించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ని కార్మికులంతా కరోనా వాక్సిన్ వేసుకోండి. కరోనా క్రైసెస్ ఛారిటీ ఆపోలో ఆసుపత్రిలో ఈ సదుపాయం ఏర్పాటుచేసింది. అపోలో 247 సౌజన్యంతో కరోనా ఛారిటీలో గురువారం నుంచి అనగా ఈనెల 22వ తేదీనుంచి నెలరోజులపాటు వేక్సిన్ వేయబడుతుంది. సినీకార్మికులు, సినీ జర్నలిస్టులు 45 ఏళ్ళు వయస్సు దాటినవారంతా తమ జీవిత భాగస్వామితో కలిసి వేక్సిన్ వేసుకోండి. మీమీ శాఖలకు సంబంధించిన అసోసియేషన్‌కు మీ వివరాలు తెలియజేయండి. అలాగే మూడు నెలలపాటు అపోలో డాక్టర్లు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా అందుబాటులో వుంటారు..కరోనా నుంచి మన పరిశ్రమను కాపాడుకుందాం. స్టే హోమ్, స్టే సేఫ్.. అంటూ చిరంజీవి తెలియజేస్తున్నారు.