శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (20:39 IST)

నాన్నతో కలిసి నటించడం అదృష్టం: రామ్‌చ‌ర‌ణ్‌

Ramcharan, Acharya
తన తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్ట‌మ‌ని రామ్ చ‌ర‌ణ్ అంటున్నారు. ఇంత‌కుముందు `బంగారు కోడిపెట్ట‌`లో క‌లిసి డాన్స్ చేసిన సంద‌ర్భం గుర్తుకు వ‌చ్చింద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. తాజాగా అయన మెగాస్టార్ నటిస్తున్న ఆచార్యలో ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఈ సినిమా గురించి రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని అభిమానుల‌తో శ‌నివారంనాడు పంచుకున్నారు.

శుక్ర‌వార‌మే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై మంచి స్పంద‌న రావ‌డంతో ఆయ‌న సోష‌ల్‌మీడియాలో అభిమానుల‌తో పాలుపంచుకున్నారు. మెగాస్టార్ స్టన్నింగ్ లుక్స్అదిరిపోయే డైలాగ్స్తో ఆచార్య టీజర్ సోషల్ మీడియాలో పెద్ద క్రేజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్బంగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ సినిమా గురించి తన ఆనందాన్ని ఫాన్స్ తో షేర్ చేసుకున్నాడు. 
 
ఈ సినిమాలో సిద్ద పాత్రలో నటించడం అదృష్టంగా ఉందని, ముఖ్యంగా తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు. అంతే కాదు ఇందులో తనది గెస్ట్ రోల్ కాదు. మెగాస్టార్గా వెండితెరపై మెరుపులు పుట్టించగల ఆయన పక్కన కలిసి నటించడం అదృష్ఠంగా భావిస్తున్నానని, ఇంతమంచి అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు థాంక్స్ చెప్పారు. 

ప్రసుతం 'ఆచార్య' రెగ్యులర్‌ షూట్‌లో రామ్ చరణ్ కూడా‌ పాల్గొంటున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చెర్రీ సరసన పూజా హెగ్డే క‌నిపించ‌నుంది.