మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జులై 2023 (16:50 IST)

దేవుడు అన్నీ చుస్తున్నాడంటూ రానా హిరణ్యకసప పోస్టర్‌పై గుణశేఖర్‌ ఫైర్‌

Hiranya kasyap- gunasekar
Hiranya kasyap- gunasekar
అమెరికాలో ప్రాజెక్ట్‌ కె. సినిమా ప్రమోషన్‌లో భాగంగా వెళ్ళిన రానా దగ్గుబాటి విడుదల చేసిన హిరణ్యకస్యప పోస్టర్‌ వివాదాలకు దారితీసింది. ఇది తాను చేస్తున్నట్లు పూర్తివివరాలు త్వరలో తెలియజేస్తానని మాత్రమే రానా అన్నాడు. ఆ పోస్టర్‌లో ఎక్కడా దర్శకుడు పేరు లేదు. రచయిత, దర్శకుడు అయిన త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ అని మాత్రమే వేశారు. దాంతో దర్శకుడు గుణశేఖర్‌ తీవ్ర మనోవేదతో ఓ ట్వీట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది. 
 
అంతా దేవుడు చూస్తున్నాడు. తగిన శాస్తి చేస్తాడంటూ అర్థమయ్యేలా గుణశేఖర్‌ పోస్ట్‌ పెట్టాడు. సింబాలిక్‌గా ఓ రాతిపై దేవుని పాదాలు పగిలినట్లున్న ఫొటోను కూడా పోస్ట్‌ చేశాడు. దాన్ని బట్టే అతని ఆవేదన ఎంతో వుందో తెలిసింది. ఎప్పటినుంచో తాను రానాతో హిరణ్యకస్యప సినిమా చేయాలనుకుంటున్నట్లు కథ కూడా సిద్ధం అయినట్లు గుణశేఖర్‌ చెప్పాడు. అయితే సమంతతో చేసిన శాకుంతలం డిజాస్టర్‌ కావడంతో ఆయన మనోవేదనతో వున్నాడు. మరి ఇప్పుడు ఈ షాక్‌ న్యూస్‌ ఆయన్ను బాగా కదిలించింది. ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను రానా తన స్వంత బేనర్‌లో నిర్మిస్తున్నట్లు సమాచారం.