Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరోలకు కష్టంగా ఉందని బరువు తగ్గాను.. 6 నెలల్లో 13 కేజీలు... హాన్సిక

మంగళవారం, 31 జనవరి 2017 (09:31 IST)

Widgets Magazine
hansika

హీరో అల్లు అర్జున్ నటించిన "దేశముదురు" చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన భామ హాన్సిక. ఆ తర్వాత అనేక భాషల్లో నటిస్తూనే.. తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా కనిపిస్తోంది. తాజాగా మంచు విష్ణుతో కలిసి 'లక్కున్నోడు' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో పాల్గొన్న హాన్సిక మాట్లాడుతూ "దక్షిణాదిన నేను చేసిన తొలి చిత్రం ‘దేశముదురు’. అందుకే నాకు తెలుగు నేల పుట్టిల్లులాంటిది. మిగిలిన ఎన్ని భాషల్లో నటించినా తెలుగు రాష్ట్రా‌ల్లో అడుగుపెట్టిన ప్రతిసారీ నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది" అని చెప్పుకొచ్చింది. 
 
పైగా, "తమిళంలో చేతినిండా సినిమాలు ఉండటంతో తెలుగులో కాస్త గ్యాప్‌ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ‘లక్కున్నోడు’ విడుదలైంది. జయం రవితో నటించిన తమిళ చిత్రం ‘భోగన్’ కూడా తెలుగులోకి అనువాదం కానుంది. సంపత్ నంది దర్శకత్వంలో మంచి పాత్ర చేస్తున్నాను. ఇప్పటివరకు నేను అలాంటి పాత్రలో నన్ను నేను చూసుకోలేదు. బస్తీ అమ్మాయిగా నటిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. 
 
బరువు తగ్గిన అంశాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఆరు నెలల్లో 13 కిలోలు బరువు తగ్గాను. ఎలాంటి డైటింగ్‌ చేయలేదు. మా అమ్మ చెప్పిన మెనూని పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యాను’’ అంతే... సులభంగా బరువు తగ్గిపోయినట్టు చెప్పారు. పెళ్లి గురించి ఇంకా ఆలోచన చేయలేదనీ, ప్రేమ వివాహమంటూ ఉండదని స్పష్టం చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావతిని అల్పంగా చూస్తారు సరే... ప్రవక్తపై సినిమా తీయండి చూద్దాం? కేంద్ర మంత్రి సవాల్

చిత్తోడ్ రాణి పద్మావతి హిందువు కాబట్టే ఆమెను సినీ పరిశ్రమ అల్పదృష్టితో చూస్తోందని ...

news

వందకోట్ల క్లబ్‌లో రాయిస్: రికార్డు కెక్కిన షారుఖ్ ఏడో సినిమా

బాలివుడ్‌లో వంద కోట్ల సినిమాల రికార్డులకు సరిహద్దులు లేనట్లున్నాయి. మొన్న సల్మాన్ ఖాన్ ...

news

నాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడమే అదృష్టం : నాని ఇంటర్వ్యూ

సినిమా రంగంలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన హీరోగా అందరూ అంటుంటే చాలా ఆనందంగా ...

news

ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా 'గుంటూరోడు' : హీరో మంచు మ‌నోజ్

రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, క్లాప్స్ అండ్ విజిల్స్ ...

Widgets Magazine