శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (10:32 IST)

శాతకర్ణిని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ అలా అన్నాడా? ‘ఈసారి సంక్రాంతి మనదే’ అంటే అర్థం ఏమిటి?

మెగా హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్‌కు మంచి ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. వరుస సక్సెస్‌లతో మంచి జోరు మీదున్న అల్లు అర్జున్ సరైనోడు తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో డీజే-దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున

మెగా హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్‌కు మంచి ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. వరుస సక్సెస్‌లతో మంచి జోరు మీదున్న అల్లు అర్జున్ సరైనోడు తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో డీజే-దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్నాడు. ఇటీవలే బన్నీకి కూతురు పుట్టిన సంతోషంలో ఉన్న బన్నీ సినిమాలతో యాడ్స్‌కు అంబాసిడర్‌గానూ కొనసాగుతున్నాడు. 
 
తాజాగా ఓ సిమెంట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికయ్యాడు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు మంగళవారం వైజాగ్‌కు చేరుకున్న బన్నీని కొందరు అభిమానులు కలిశారు. అందులో కొందరు అభిమానులు బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి పరోక్షంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 గురించి అడిగిన అభిమానులతో.. ‘ఈ సారి సంక్రాంతి మనదే’ అని వ్యాఖ్యానించినట్టు టాక్.
 
ఆ మాట నందమూరి ఫ్యాన్స్‌కి తెలియడంతో.. అంటే బాలకృష్ణ శాతకర్ణి సినిమా కన్నా ఖైదీ నంబర్ 150నే సూపర్ హిట్ అన్న అర్థంలోనే బన్నీ ఆ వ్యాఖ్యలు చేశాడని అనుకుంటున్నారు. దీంతో బన్నీపై నందమూరి అభిమానులు మరింత పదునైన వ్యాఖ్యలను ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. కాగా, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్.. సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ‘ఖబడ్దార్’ అన్న పదాన్ని వాడాడు. 
 
దానిపై అతడు వివరణ ఇచ్చినా.. బన్నీ ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సి వచ్చిందని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారట. కాగా, అంతకు ముందు కూడా పవన్ కల్యాణ్‌నుద్దేశించి ‘చెప్పను బ్రదర్’ అని బన్నీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యతో బన్నీ.. కొంత పవన్ అభిమానుల కోపానికి కారణమయ్యాడు. మరి శాతకర్ణిపై బన్నీ కామెంట్స్ ఏ వివాదానిరి దారితీస్తాయో వేచి చూడాల్సిందే. అయితే బన్నీ ట్విట్టర్‌ ద్వారా హ్యాపీ సంక్రాంతి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలకు బెస్ట్ విషెస్ చెప్పారు.