#HariHaraVeeraMalluగా వస్తోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (video)
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లోకి వెళ్ళిన ఆయన అందులో వుంటూనే 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇదే తరుణంలో హిస్టారికల్ ఫిక్షన్ తరహాలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ముందు నుండి రకరకాల పేర్లు వినిపించాయి.
చివరీ సినిమా యూనిట్ సినిమా పేరును ప్రకటించింది. అదే హరిహర వీరమల్లు, తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ గ్లింప్జ్ రిలీజ్ చేశారు. ఇందులలో పవన్ ఒక యోధుడిలా కనిపిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నాడని అన్నారు. మొఘలుల కాలం నాటి సమయంలో జరిగిన ఒక సంఘటన నీ ఆధారం చేసుకుని డైమండ్ చుట్టూ సినిమా స్టోరీ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారని అంటున్నారు.