ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..
ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రాన్న ప్రత్యేకంగా ప్రదర్శించారు. శనివారం రాత్రి ప్రదర్శించిన తొలి ఆటకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే, ఆడిటోరియం పూర్తిగా నిండిపోవడంతో అనేక మంది చిత్రాన్ని వీక్షించలేకపోయారు. దీంతో ఆదివారం కూడా రెండు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 24వ తేదీన భారీ ఓపెనింగ్స్‌తో ఈ చిత్రం విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారికి ఈ చిత్రాన్ని చేరువ చేసేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు ప్రదర్శించనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి 7 గంటలకు జరిగిన మొదటి షోకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. దీంతో ఆదివారం కూడా రెండు షోలను ప్రదర్శించనున్నారు.