శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (11:43 IST)

పవన్‌కు ఇవన్నీ అవసరమా? డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రశ్న

అఖండ పేరు ప్రఖ్యాతలు కలిగివున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అవన్నీ వదిలి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమా అని తాను ఆరంభంలో భావించానని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. "నేలటిక్కెట్" చిత్రం ఆడియో వేడుకలో ఆయ

అఖండ పేరు ప్రఖ్యాతలు కలిగివున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అవన్నీ వదిలి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమా అని తాను ఆరంభంలో భావించానని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. "నేలటిక్కెట్" చిత్రం ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సకల సౌకర్యాలు ఉన్న పవన్ కళ్యాణ్ వాటన్నింటినీ విడిచి పెట్టి నిస్వార్థ సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు.
 
విజయవాడలో జరిగిన ర్యాలీలో అంత ఎండలో చెమటలు కక్కుకుంటా తడిసిన కుర్తాలో నడుచుకుంటూ వెళుతుంటే ఫస్ట్ టైమ్ నాకు అనిపించింది.. ఇవన్నీ ఆయనకు అవసరమా అని అనిపించింది. 
 
ముఖ్యంగా, అఖండ పేరు ప్రఖ్యాతలు, కోట్లాది రూపాయల సంపద, కీర్తి ప్రతిష్టలను కాదనీ నిస్వార్ధ సేవ చేయాలన్న ఆలోచనలతో రాజకీయాల్లోకి వస్తున్న పవన్‌ కళ్యాణ్‌కు తన అభినందనలు అని చెప్పారు. అలాంటి మహా మనిషికి ప్రత్యేక అభినందనలు అని చెప్పారు.