గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (13:46 IST)

హెబ్బా పటేల్ న‌టిస్తున్న చిత్రం ప్రారంభం

Hebba Patel,  Shyam Devabhakthuni, Karthik Garimella
Hebba Patel, Shyam Devabhakthuni, Karthik Garimella
హెబ్బా పటేల్, అర్చన, ఆశు రెడ్డి ప్రధాన పాత్రలలో న‌టించ‌నున్న కొత్త చిత్రం శుక్ర‌వారంనాడు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభమైయింది.  శ్యామ్ దేవభక్తుని నిర్మతగా కార్తీక్ గరిమెళ్ల దర్శకత్వంలో రూపొంద‌నుంది.
 
ఈ చిత్రం పూజా కార్యక్రమానికి హాజరైన కెఎస్ రామారావు, సుహాస్ కృష్ణ దేవభక్తుని క్లాప్ ఇవ్వగా, రమేష్ బాబు గరిమెళ్ల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ బాబు మండవ, నాగినీడు స్క్రిప్ట్ అందించగా కెఎల్ నారాయణ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అన్నే రమేష్ గౌరవ అతిధిగా హాజరయ్యారు. 
 
ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా అర్జున్ రవి కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అఖిల దాసరి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.
 
తారాగణం :  హెబ్బా పటేల్, అర్చన, ఆశు రెడ్డి
టెక్నికల్ టీమ్ :  దర్శకత్వం: కార్తీక్ గరిమెళ్ల, నిర్మాత; శ్యామ్ దేవభక్తుని, సంగీతం : సమర్థ్ గొల్లపూడి, డీవోపీ: అర్జున్ రవి,  ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె,  స్టంట్స్ : నందు
కొరియోగ్రఫీ: అనే మాస్టర్, సాహిత్యం: కృష్ణకాంత్.