సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ.
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:15 IST)

హలో అంటోన్న నమ్రతతో మహేష్ బాబు

Mahesh-namrata
మహేష్ బాబు, నమ్రతల జంట మ‌రోసారి క‌లిసి న‌టించారు. ఇరువురూ యాడ్‌కోసం న‌టించ‌డం ప‌రిపాటే. ఈసారి హ‌లో అంటూ ఇద్ద‌రూ ప‌లుక‌రించుకుంటున్న స‌న్నివేశాన్ని అందులో పొందుప‌రిచారు. తాజాగా వీళ్లిద్దరు `హలో మ్యాగజైన్` కోసం ఫోటోలకు ఫోజులిచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు న‌మ్ర‌త త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
 
Mahesh-namrata
ఆ మధ్య మహేష్ బాబు, నమ్రతతో పాటు తన పిల్లలతో కలిసి ఓ యాడ్‌లో నటించారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ న‌టించ‌డం విశేషం. కాగా,. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. అంతేకాదు చాలా కాలానికి మహేష్ బాబు, నమ్రత ఇలా ఒకే ఫోటో ఫ్రేములో చూసి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. అప్ప‌ట్లో త‌న పిల్ల‌ల కెరీర్‌పై శ్ర‌ధ్ద‌పెట్టిన న‌మ్ర‌త ఇప్పుడు మ‌హేష్ కెరీర్‌పైనా శ్ర‌ద్ధ పెడుతుంది. త‌ను ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాల‌నేవిష‌యాల‌ను కూడా ఆమె ప‌ర్య‌వేక్షిస్తుంది. తాజాగా స‌ర్కారువారి పాట మ‌హేస్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా వుంది. వ‌చ్చే ఏడాది రాజ‌మౌళితో సినిమా చేయ‌నున్నాడు.