శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (14:28 IST)

తమిళనాడు నీరు తాగి పెరిగిన శరీరం ఇది అంటున్న టాలీవుడ్ హీరో...

దక్షిణ భారత సినీ, టీవీ స్టంట్‌ ఆర్టిస్టుల యూనియన్‌ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. యూనియన్‌ అధ్యక్షుడు అనలరసన్‌ నేతృత్వంలో

దక్షిణ భారత సినీ, టీవీ స్టంట్‌ ఆర్టిస్టుల యూనియన్‌ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. యూనియన్‌ అధ్యక్షుడు అనలరసన్‌ నేతృత్వంలో సీనియర్‌ నటుడు శివకుమార్‌, ఆయన వారసులు సూర్య, కార్తీ చేతులమీదుగా జ్యోతిప్రజ్వలన చేయించి స్వర్ణోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. 
 
ఈ సందర్భంగా శివకుమార్‌ స్టంట్‌ యూనియన్‌కు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. వేడుకల్లో భాగంగా సీనియర్‌ స్టంట్‌ ఆర్టిస్టులను మోహన్‌లాల్‌, బాలకృష్ణ, భాగ్యరాజా చేతుల మీదుగా సత్కరించారు. ఈ వేడుకల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హీరో నందమూరి బాలకృష్ణ తదితర దిగ్గజ హీరోలు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... 'తనతో పాటు స్టంట్‌ కళాకారులకు ఇది మర్చిపోలేని రోజు. 25 ఏళ్ల క్రితం స్టంట్‌ యూనియన్‌ రజతోత్సవ వేడుకలకు నాన్న ఎన్టీఆర్‌ వచ్చారు. 50 యేళ్ల వేడుకలకి నేను వచ్చాను. 75 ఏళ్ల వేడుకలకు నా కొడుకును, వందేళ్ల వేడుకలకు నా మనవడ్ని పంపిస్తాను అని ప్రకటించారు. 
 
ముఖ్యంగా, నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. తమిళనాడు నీరు తాగి పెరిగిన శరీరం ఇది. నాన్న కూడా ఇదే మాట చెప్పేవారు. ఆ కృతజ్ఞతతోనే చెన్నైకి తెలుగు గంగని ఇచ్చారు. ఎందరో సీనియర్‌, జూనియర్‌ స్టంట్‌ ఆర్టిస్టులతో పనిచేశాను. స్టంట్‌ యూనియన్‌కు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తాను. సినిమాకు భాష లేదు’ అని బాలకృష్ణ సభాముఖంగా ప్రకటించారు.