1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 21 మార్చి 2017 (02:54 IST)

అడ్డంగా దొరికిపోయిన ధనుష్..పుట్టుమచ్చలు చెరిపేసాడా.. కొంప మునిగినట్లేనా?

తెలివి తన ఒక్కడి సొంతమే అని అతిగా నమ్మిన తమిళ సినీ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ న్యాయస్థానానికి అడ్డంగా దొరికిపోయాడా.. అవుననే అంటున్నారు వైద్యులు. లేజర్ చికిత్స ద్వారా తన ఒంటిమీది పుట్టుమచ్చలను ధనుష్ ఉద్దేశపూర్వకంగా చెరిపివేశారని అతడిని పరిశీలించిన

తెలివి తన ఒక్కడి సొంతమే అని అతిగా నమ్మిన తమిళ సినీ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ న్యాయస్థానానికి అడ్డంగా దొరికిపోయాడా.. అవుననే అంటున్నారు వైద్యులు. లేజర్ చికిత్స ద్వారా తన ఒంటిమీది పుట్టుమచ్చలను ధనుష్ ఉద్దేశపూర్వకంగా చెరిపివేశారని అతడిని పరిశీలించిన వైద్యులు కోర్టుకు నివేదిక సమర్పించడంతో ధనుష్ తమ బిడ్డే అని కోర్టుకెక్కిన కదిరేశన్, మీనాక్షి దంపతులవైపే న్యాయం ఉన్నట్లు తేలిపోయింది. విషయానికి వస్తే.. 
 
పుట్టుకతో శరీరంపై వచ్చిన మచ్చలను మాయం చెయ్యొచ్చా అనడిగితే... చేసేయొచ్చు. వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ... లేజర్‌ చికిత్సతో పుట్టుమచ్చలను మాయం చేయవచ్చు. ఇప్పుడు తమిళ హీరో ధనుష్‌ ఆ పనే చేశాడని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అతడికి కోర్టులో చిక్కులు తప్పేట్లు కనిపించడం లేదు.
 
ధనుష్‌ తమ కుమారుడేనని తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం... వాళ్ల వాదనల్లో నిజం లేదని ధనుష్‌ పేర్కొనడం తెలిసిన విషయాలే. పలుమార్లు విచారణ జరిపిన అనంతరం కదిరేశన్‌ దంపతులు కోరినట్టు ధనుష్‌ పుట్టుమచ్చలను పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్‌ చికిత్స ద్వారా పుట్టుమచ్చలను రూపుమాపారని సోమవారం కోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. దీంతో కదిరేశన్‌ దంపతుల వాదన నిజమే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.