శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (18:39 IST)

నటించే స్కోప్ లేకనే మహేష్‌కు తల్లిని కాలేదు...

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ చిత్రం 'శ్రీమంతుడు'. రికార్డు స్థాయిలో వసూళ్లను కుమ్మరించిన ఈ చిత్రంలో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా కాదంటారా. అయితే అలనాటి నటి ప్రేమ మాత్రం ఇందులో నటించేందుకు అంగీకరించలేదట. ఈ విషయాన్ని ఇటీవల ఆమె స్వయంగా వెల్లడించింది. 
 
గతంలో క్రేజీ హీరోయిన్లుగా వెలిగిన అందాల తారలు పెళ్లి, పిల్లలు అంటూ వెండితెరకు దూరమైనప్పటికీ, కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ నటనవైపు అడుగులు వేస్తుంటారు. అలా ఆ మధ్య ధర్మచక్రం, దేవి తదితర చిత్రాలలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తార ప్రేమ. ఇటీవల అమ్మడు మళ్లీ నటించేందుకు సిద్ధమని, మంచి అవకాశాలు వస్తే నటిస్తానని ప్రకటించింది.
 
ఈ విషయం తెలుసుకున్న 'శ్రీమంతుడు' చిత్ర యూనిట్ ప్రేమ దగ్గరకు వెళితే కథ మొత్తం విని, ఆ పాత్రలో నటించేందుకు అంగీకరించలేదట. ఈ విషయాన్ని ప్రేమ తాజాగా ఒక న్యూస్ చానల్‌లు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ సమయంలో శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్ బాబు తల్లిగా నటించమని దర్శకుడు కొరటాల శివ తనను కలసిన విషయాన్నీ గుర్తుచేసుకుంది ప్రేమ. 
 
కథ మొత్తం తను విన్నానని, అయితే సినిమాలో మహేష్ తల్లి పాత్రకు నటించే స్కోప్ లేకపోవడంతో ఆ సినిమాలో చేసేందుకు అంగీకరించలేదని చెప్పుకొచ్చింది. తను కచ్చితంగా తెలుగులో రీఎంట్రీ ఇస్తానని, అయితే రీ ఎంట్రీ సినిమా మాత్రం చాలా గ్రాండ్‌గా ఉండాలని కోరుకుంటుంది ప్రేమ. మరి ఆమె కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.