సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (18:06 IST)

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్‌నే ఎలా బాధ్యులను చేస్తారు? నాని ప్రశ్న

Nani
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు, రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనకు హీరో అల్లు అర్జున్‌ను మాత్రమే బాధ్యుడుని చేయడం ఏమాత్రం న్యాయం కాదని హీరో నాని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ అరెస్టుపై నాని ఎక్స్ వేదికగా స్పందించారు. 
 
సినిమావాళ్లకు సంబంధించి ఏ విషయంలోనైనా... ప్రభుత్వ అధికారులు, మీడియా చూపిస్తున్న ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని, హృదయ విదారకమైనదన్నారు. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు.
 
ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే, ఈ ఘటనలో అందరి తప్పు ఉందని, ఒకరినే బాధ్యుడిగా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, అల్లు అర్జున్ అరెస్ట్‌ను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు.