సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (22:06 IST)

రామ్ ఆ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తున్నాడా?

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ప్ర‌స్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ చేస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ న‌టిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్ పైన పూరి - ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని మే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే... రామ్ త‌దుప‌రి చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకురానున్నార‌ని స‌మాచారం. అయ్యారే, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రాల ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర ఇటీవ‌ల‌ రామ్‌కి ఓ క‌థ చెప్పాడ‌ట‌. విన్న వెంట‌నే క‌థ బాగా న‌చ్చ‌డంతో రామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిసింది. ఈ చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పైన స్ర‌వంతి ర‌వి కిషోర్ నిర్మించ‌నున్నారు. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మా కాదా అనేది తెలియాల్సి వుంది.